జాతీయంBreaking News

IPO : ఐపీవో బాటలో మరో కంపెనీ.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన కరోనా రెమెడీస్ లిమిటెడ్..!

IPO : ఐపీవో బాటలో మరో కంపెనీ.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన కరోనా రెమెడీస్ లిమిటెడ్..!

ముంబయి, మన సాక్షి:

క్రిస్‌క్యాపిటల్ అనుబంధ సంస్థ సెపియా ఇన్వెస్ట్‌మెంట్స్ దన్ను గల ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ అయిన కరోనా రెమెడీస్ లిమిటెడ్ తమ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

దీని ప్రకారం కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో మొత్తం రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ కింద జారీ చేసే షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి. మహిళల ఆరోగ్య సంరక్షణ, కార్డియో-డయాబెటో, నొప్పి నివారణ, యూరాలజీ తదితర ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది.

జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్), కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

MOST READ NEWS :

  1. Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

  2. KFin: కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ఇక సులభం.. నూతన కేవైసీ సొల్యూషన్‌ ఆవిష్కరణ..!

  3. NPCI : ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారం..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

  5. Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు