తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

Gest Lectures : అతిథి అధ్యాపకుల కొరకై దరఖాస్తుల ఆహ్వానం..!

Gest Lectures : అతిథి అధ్యాపకుల కొరకై దరఖాస్తుల ఆహ్వానం..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డు లో గల ఎర్రగుట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో అతిథి అధ్యాపకుల కొరకై అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపల్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు.

నారాయణపేట కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల లో ఫిజిక్స్, మాథ్స్, ఇంగ్లీషు బోధించేందుకు బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ మరియు జిల్లా స్థానికత కలిగివున్న మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ నుండి మార్చ్ వరకు అతిధి ఆధ్యాపకులుగా బోధించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులను కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో దరఖాస్తులు అందించాలని పూర్తి వివరాలకై సెల్ నెంబర్ 9441280032 కు సంప్రదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు