UTI: మీరు వేల్యూ ఇన్వెస్టరా.. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ మీ కోసమే..!

UTI: మీరు వేల్యూ ఇన్వెస్టరా.. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ మీ కోసమే..!
ముంబయి:
మార్కెట్ ఒడుదొడుకుల్లో మీ పెట్టుబడికి భద్రతతో కూడిన వృద్ధిని ఆశిస్తున్నారా? అయితే, యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ మీ కోసమే! బలమైన వ్యాపారాలు కలిగిన పెద్ద, మధ్య తరహా కంపెనీల షేర్లను వాటి అసలు విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే వేల్యూ ఇన్వెస్టింగ్ సూత్రాన్ని ఈ ఫండ్ అనుసరిస్తోంది.
సెబీ నిబంధనల ప్రకారం, లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 35 శాతం లార్జ్ క్యాప్ కంపెనీల్లోనూ, మరో 35 శాతం మిడ్ క్యాప్ కంపెనీల్లోనూ పెట్టుబడి పెట్టాలి. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్ షేర్లపై ఎక్కువ దృష్టి పెడుతూనే, అధిక వృద్ధి కోసం మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.
వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది తక్కువ విలువలో ఉన్న షేర్లను గుర్తించి పెట్టుబడి పెట్టే ఒక విధానం. మార్కెట్లు కొన్నిసార్లు స్వల్పకాలిక అంశాలకు అతిగా స్పందించినప్పుడు, మంచి కంపెనీల షేర్లు కూడా వాటి నిజమైన విలువ కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
ఇలాంటి సమయాల్లో వేల్యూ ఇన్వెస్టర్లు వాటిని కొనుగోలు చేస్తారు. తక్కువ ధరకు కొనడం వల్ల నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందితే మంచి లాభాలు పొందవచ్చు. వేల్యూ ఇన్వెస్టర్లు వృద్ధి కంటే పెట్టుబడి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
షేర్ల ధరలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని, కాలక్రమేణా వాటి సరైన విలువకు చేరుకుంటాయని వారు నమ్ముతారు. కంపెనీ ప్రాథమికాంశాలు మెరుగుపడినప్పుడు, వేల్యూ ఇన్వెస్టర్లు మంచి రాబడిని పొందుతారు. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ సగటు వేల్యూయేషన్ కంటే తక్కువ ధరలో లభిస్తూ, భవిష్యత్తులో మంచి వృద్ధి అవకాశాలు ఉన్న రంగాలను ఎంపిక చేస్తుంది.
ఆ తర్వాత బలమైన వ్యాపార నమూనా కలిగి, సరైన వేల్యూయేషన్‌లో ఉన్న కంపెనీలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆ కంపెనీల గత పనితీరు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి కంపెనీ విలువ మారుతూ ఉంటుందని, ఆర్థిక పరిస్థితులు లేదా ప్రత్యేక కారణాల వల్ల అది ప్రభావితమవుతుందని ఈ ఫండ్ విశ్వసిస్తుంది.
ఇలాంటి మార్పుల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని లాభం పొందడమే ఈ ఫండ్ లక్ష్యం. మంచి వేల్యూయేషన్లతో ఉండి, వృద్ధిని నమోదు చేస్తున్న కంపెనీల పైనా ఈ ఫండ్ దృష్టి సారిస్తుంది.
ముఖ్య సూత్రాలు…
ఈ ఫండ్ యొక్క పెట్టుబడి వ్యూహం మూడు ముఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. గత చరిత్ర లేదా పోటీ సంస్థలతో పోల్చి వేల్యూయేషన్ను చూడటం. సరైన వేల్యూయేషన్లలో వృద్ధి అవకాశాలను అందుకోవడం. ఏదైనా ఆస్తి కాలక్రమేణా తన సగటు స్థాయికి తిరిగి వస్తుందనే నమ్మకం.
చారిత్రక వేల్యూయేషన్లు లేదా పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకు ట్రేడ్ అవుతూ, భద్రతను అందించే నాణ్యమైన కంపెనీలపై ఈ ఫండ్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అలాగే, సరైన వేల్యూయేషన్లలో ట్రేడ్ అవుతూ, వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. స్మాల్ క్యాప్స్ వృద్ధి, విలువ పరంగా మంచి కలయికను అందించగలవు.
మార్కెట్ వాటిపై ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం, మంచి కంపెనీలు కూడా కొన్నిసార్లు సరైన ధరలో లభించే అవకాశం ఉండటం దీనికి కారణం. తక్కువ వేల్యూయేషన్లతో ట్రేడ్ అవుతూ, కాలక్రమేణా లాభదాయకత, వేల్యూయేషన్ సగటు స్థాయికి తిరిగి రావడం వల్ల లాభం పొందగల వ్యాపారాలను ఎంచుకోవడం ఈ ఫండ్ ప్రధాన ఉద్దేశం. యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 2009లో ప్రారంభమైంది.
2025 ఏప్రిల్ 30 నాటికి ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 4,300 కోట్లకు పైగా ఉంది. 2025 ఏప్రిల్ 30 నాటికి ఈ ఫండ్ సుమారు 47% నిధులను పెద్ద కంపెనీల్లోనూ, 39% నిధులను మధ్య తరహా కంపెనీల్లోనూ, మిగిలిన నిధులను చిన్న కంపెనీల్లోనూ పెట్టుబడి పెట్టింది.
ఈ స్కీమ్ ప్రధానంగా పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, ఇండస్టవర్స్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఉన్నాయి.
ఈ కంపెనీల వాటా మొత్తం పోర్ట్‌ఫోలియోలో సుమారు 32 శాతంగా ఉంది. మొత్తానికి, వేల్యూ ఇన్వెస్టింగ్ విధానాన్ని విశ్వసిస్తూ, లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి యూటీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక మంచి ఎంపిక. దీర్ఘకాలిక సంపద సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఈ ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది.
MOST READ :
-
District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!
-
District collector : ఉద్యోగ భవిష్యత్తుగా భవిత కేంద్రాలు.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
-
PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!
-
ReSL: నెట్ జీరో లక్ష్యానికి ఊతం.. రీ సస్టైనబిలిటీ ఐఎస్ఎస్తో సరికొత్త శకం..!
-
Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!









