Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!

Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్స్ ప్రతి ఒక్కరికి పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల విధానం చాలా పాపులర్ గా అయింది. అలాంటి వారు బ్యాంకులలో తరచుగా డబ్బులు వేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేస్తున్నారు. బ్యాంకు ఖాతాను లింకు చేసుకుని దాని ద్వారా ఒకేరోజు లక్ష వరకు డబ్బులు పంపుతున్నారు.
పెద్దపెద్ద లావాదేవీలకు కూడా యూపీఐ ని వాడుతున్నారు. బ్యాంకులలో తరచుగా డబ్బులు డిపాజిట్ కూడా చేస్తుంటారు. అయితే అలాంటివారు కొన్ని విషయాలు తెలుసుకోకుంటే చిక్కుల్లో పడ్డట్టే. బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే ఇన్కమ్ టాక్స్ నోటీసులు రావచ్చు. బ్యాంకులో 50వేల రూపాయలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.
(సిబిటిపి) కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు ఖాతాలో పది లక్షలకు మించి డబ్బులు, డిపాజిట్, విత్ డ్రా చేయడం లాంటివి చేస్తే ఐటీ శాఖ పరిధిలోకి వెళ్తాయి. పరిమితికి మించి నగదు జమ చేసినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చూపించాల్సి ఉంటుంది.
వాటికి ట్యాక్స్ చెల్లించాలని ఇన్కమ్ టాక్స్ నుంచి నోటీసులు రావచ్చు. ఆ సమయంలో ఆదాయ వనరులు చూపించకుంటే భారీగా పెన్నాలిటీలు కూడా కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసేవారు సైతం నిబంధనలు తెలుసుకోవాల్సింది.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల పైన ఎఫ్డి చేసే వారి వివరాలు సైతం బ్యాంకులు ఆదాయ శాఖకు పంపిస్తున్నాయి. బ్యాంకులు మీరు చిన్న చిన్న మొత్తాలలో డిపాజిట్ చేసినా మొత్తం కలిపి లిమిట్ దాటితే ఐటి శాఖ నిఘా నీడలోకి వెళ్తారు. ఇలా చేస్తే ఐటి శాఖ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ఇల్లు, భూమి ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు 30 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్ చేస్తే రిజిస్టర్ ఆ వివరాలను ఐటీ శాఖకు తెలియజేస్తారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారు కచ్చితంగా ఇలాంటి ఇబ్బందులను తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ లావాదేవీలు చేసినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించే ధ్రువీకరణ పత్రాలు కూడా దగ్గర పెట్టుకోవాల్సి ఉంది.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!
-
SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
-
Gold Price : హైదరాబాదులో తులం బంగారం రేటు ఎంతంటే..?









