Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

PDS : పిడిఎస్ దందా ముఠా అరెస్ట్.. భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!

PDS : పిడిఎస్ దందా ముఠా అరెస్ట్.. భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!

మన సాక్షి, మిర్యాలగూడ :

పిడిఎస్ బియ్యం దందా అంతర రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వీరు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా రేషన్ బియ్యం సేకరించి కాకినాడ పోర్టుకు, కోళ్ల ఫారాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరిలో 9 మందిపై కేసు నమోదు కాగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం జమ్మి చెట్టు బజారుకు చెందిన మందపాటి నరేందర్ బియ్యం కొనుగోలు చేసి అదే ప్రాంతానికి చెందిన అప్పారావుతో కలిసి రేషన్ బియ్యాన్ని తెలంగాణలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుండి వాడపల్లి మీదుగా సరిహద్దులు దాటిస్తున్నాడు. కాగా ఈనెల 21వ తేదీన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 66 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ అక్రమ రవాణా వెనుక మండపాటి నరేందర్, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇందిరానగర్ చెందిన మాదేనేటి చంద్రశేఖర్, అప్పారావు లు ఉన్నట్లు తెలిపారు. అదే రోజు నాగార్జునసాగర్ చెక్ పోస్టు వద్ద రేషన్ అక్రమ రవాణా బియ్యం లారీ పట్టుబడింది. ఇదిలా ఉండగా రెంటచింతలకు చెందిన నెమలి నాగిరెడ్డి, నారాయణ, ఓంకార్ రెడ్డి, మధు, జలక్రితికి చెందిన సైదిరెడ్డి, నెల్లికల్ చెందిన శ్రీధర్ రెడ్డితో కలిసి గట కొంతకాలంగా రేషన్ అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ రెండు వేరు వేరు కేసుల్లో నలుగు రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు విషయంలో మిర్యాలగూడ రూరల్ సిఐ పి.ఎన్.డి ప్రసాద్, నాగార్జునసాగర్ సిఐ బిసన్న, ఎస్ఐలు లక్ష్మయ్య, సంతోష్, ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి, కానిస్టేబుల్ నాగరాజు, సురేష్, నరేంద్ర తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!

  2. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

  3. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

  4. Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

మరిన్ని వార్తలు