SURYAPET : రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముఠా

రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముఠా
అరెస్టు చేసిన పోలీసులు
సూర్యాపేట, మనసాక్షి
రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగలను సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు…. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మేడిపల్లి కి చెందిన రఘు, మరియు తిరుపతికి చెందిన గణేష్ ఈ ఇద్దరు నిందుతులు 2022 సంవత్సరంలో చర్లపల్లి జైల్లో పరిచయం ఏర్పడింది .. కాగా ఇద్దరు కలిసి ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారని ఎస్పీ తెలిపారు.. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని చోరీలు చేయడంలో ఈ ముఠా అరితేరింది… ఏ-1 పై ఉప్పల్ ,మేడిపల్లి ,కరీంనగర్, హుజురాబాద్ ,పోలీస్ స్టేషన్లో 32 కేసులు ఉండగ,ఏ-2 పై కడప, ఎల్బీనగర్, మేడిపల్లి, ఉప్పల్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో మొత్తం 30 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ నేపథ్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఉదయం 5 గంటల సమయంలో పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లు సతీష్ వర్మ, యాకుబ్లు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు సిబిజెడ్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నింగా పోలీసులను చూసి వారు పారిపోతున్న క్రమంలో పోలీసులు వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు.. ఈ మేరకు వారి వద్ద ఉన్న బంగారు అభరణాలు లభ్యం కావడంతో ఎక్కడవని పట్టణ సిఐ రాజశేఖర్ ప్రశ్నించాగా వారు మేడిపల్లి,సూర్యపేట ,తొర్రూరు ,కోదాడలో రాత్రి వేళల్లో ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాట్లు ఎస్పీ తెలిపారు.
ఈ మేరకు నిందితుల వద్ద నుండి 16 తులాల బంగారం, 880 గ్రాముల వెండి ఆభరణాలు,రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
దొంగలను చౌక చక్యాంగా పట్టుకున్న సిఐ రాజశేఖర్,ఎస్ఐలను, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించి రివార్డులు అందజేశారు.. ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.