వైభవంగా అయ్యప్ప స్వామి కళిశ పూజ మహోత్సవం

వైభవంగా అయ్యప్ప స్వామి కళిశ పూజ మహోత్సవం

మిర్యాలగూడ, డిసెంబర్ 16, మన సాక్షి : మిర్యాలగూడ పట్టణం అశోక్ నగర్ నందు గల అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత 47 రోజులుగా ఎన్బిఆర్ ఫౌండేషన్ అద్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముగింపులో భాగంగా శుక్రవారం అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్లు  నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి కాళీశా పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సతి సమేతంగా హాజరైనారు.

అనంతరం అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్లు అద్వర్యంలో అయ్యప్ప మహా మండల పూజ నిర్వహించారు. బిఆర్ఎస్ యువనేత, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొని ప్రత్యెక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పునాటీ లక్ష్మీనారాయణ, సాదినేని శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్లు, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు…