Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!

మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!

హైదరాబాద్, మన సాక్షి :

మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అనుచరుల ఇళ్లలో గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాదులోని హిమాయత్ నగర్, బంజరా హిల్స్, సాగర్ రోడ్డు, మిర్యాలగూడ ప్రాంతాలలో కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కార్యాలయాలు, ఇళ్లలో పెద్ద ఎత్తున డబ్బులు నిల్వ ఉన్నాయనే సమాచారంతో ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి  లో భాస్కరరావు ముఖ్య అనుచరుడు, కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!

మరిన్ని వార్తలు