Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : బతుకమ్మ ఆటలాడిన కలెక్టర్, ఎమ్మెల్యే..!

District collector : బతుకమ్మ ఆటలాడిన కలెక్టర్, ఎమ్మెల్యే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట మున్సిపాలిటి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక బారం బావి వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, ట్రైనీ కలెక్టర్ గరిమా నరులా ముఖ్య అతిథులుగా హాజరై అక్కడి బంతిపూల బతుకమ్మ కు ప్రత్యేక పూజలు చేసి అందరికీ బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.

తొలిసారిగా నారాయణపేటలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలాడటం సంతోషంగా ఉందని కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ట్రైనీ కలెక్టర్ బతుకమ్మ ఆటలాడారు. కలెక్టర్, ఎమ్మెల్యే మహిళలను ఉత్సాహ పరుస్తూ వారి అడుగులో అడిగేసి బతుకమ్మ పాటలకు చూడముచ్చటగా ఆటలాడారు.

అందరితో కలిసి వారు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు సరితా, వరలక్ష్మి, నారాయణమ్మ, మున్సిపల్ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, పట్టణానికి చెందిన యువతులు, చిన్నారులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు