BC CM : బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పని చేయాలి..!

తెలంగాణకు తొలి బీసీ ముఖ్యమంత్రిని సాధించడమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం అందించే ఘనమైన నివాళి అని తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

BC CM : బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పని చేయాలి..!

సికింద్రాబాద్, మనసాక్షి:

తెలంగాణకు తొలి బీసీ ముఖ్యమంత్రిని సాధించడమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం అందించే ఘనమైన నివాళి అని తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా బుదవారం తన కార్యాలయంలో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యమై మైనార్టీలైన రెడ్డి, వెలమలను కాకుండా తెలంగాణలో మెజార్టీ ప్రజలైన బీసీ ముఖ్యమంత్రే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ALSO READ : KTR : తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ.. రావాలంటే క్షమాపణ చెప్పాల్సిందే..!

ఈ మేరకు తెలంగాణ ఉమ్మడి జిల్లాలలో తెలంగాణ సామాజిక న్యాయం బీసీ ముఖ్యమంత్రి సాధన సదస్సులు నిర్వహిస్తున్నామనీ తెలిపారు. ఈనెల 30న కరీంనగర్ జిల్లా కేంద్రంగా రెవిన్యూ గార్డెన్స్ లో జరిగే సదస్సును విజయవంతం చేయాలనీ కోరారు.

ఆచార్య జయశంకర్,ఆచార్య కోదండరామిరెడ్డిలు భౌగోళిక తెలంగాణ కోసం కృషి చేస్తే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బహుజన తెలంగాణ కోసం తన జీవితకాలం పోరాటం చేశారని అన్నారు. తెలంగాణలోని 93% ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ లైన బహుజనులు బాపూజీ పోరాటాల స్ఫూర్తితో 2023 లో తెలంగాణకు తొలి బీసీ ముఖ్యమంత్రిని సాధించాలని కోరారు.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి ముఖ్యమంత్రి సాధన సమితి కో కన్వీనర్ తెలంగాణ హైకోర్టు న్యాయవాది పోలేపాక చంద్రకళ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం స్కాలర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!