KTR : తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ.. రావాలంటే క్షమాపణ చెప్పాల్సిందే..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ త్యాగాలను కించపరిచే విధంగా పదేపదే మాట్లాడుతున్నాడని మహబూబ్నగర్ కు రావాలంటే క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

KTR : తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ.. రావాలంటే క్షమాపణ చెప్పాల్సిందే..!

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో డిమాండ్

హైదరాబాద్ , మన సాక్షి :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ త్యాగాలను కించపరిచే విధంగా పదేపదే మాట్లాడుతున్నాడని మహబూబ్నగర్ కు రావాలంటే క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంటులో అనేక పర్యాయాలు తల్లిని చంపి బిడ్డను బతికించారని అనటం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు. త్యాగాలను అవమానిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో కాలుపెట్టే అర్హత లేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని.. ఆయన అన్నారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి జాతీయ పార్టీలా… వ్యవహరించడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

గవర్నర్లు మోడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు :

తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ గవర్నర్లు కూడా మోడీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా క్యాబినెట్ సిఫారసు చేసిందని, గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదన్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని సిఫారసు చేయొద్దని గవర్నర్ చెప్పారని … ఈ నియమం ఆమెకు వర్తించదా..? అన్నారు.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

గవర్నర్ అయ్యే ముందు వరకు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారు గవర్నర్ గా వ్యవహరించకూడదని సర్కారియా కమిషన్ స్పష్టం చేసిందన్నారు. జ్యోతిరాధిత్య సింధియా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని, గవర్నర్ ఇప్పటికీ బీజేపీ నేతగా వ్యవహరించట్లేదా..? అన్నారు. మీకు ఒక న్యాయం..? ఇతరులకు న్యాయమా?

గవర్నర్ పదవికి తమిళి సై అనర్హురాలు అని, బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను శాసనమండలికి తీసుకొస్తామంటే మీకేంటి ఇబ్బంది. ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులో ..? మా క్షేత్రంలో తేల్చుకుంటాం అని కేటీఆర్ అన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!