Double Bed Room Houses : నాలుగేళ్లుగా నిర్లక్ష్యం.. పేదలకు దూరంగా..!

Double Bed Room Houses : నాలుగేళ్లుగా నిర్లక్ష్యం.. పేదలకు దూరంగా..!
చింతపల్లి. మన సాక్షి :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో గత బి.ఆర్. ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు పంపిణీ చేయకపోవడంతో ఆ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారి నిరుపయోగంగా మారిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.
మండలంలో గడియ గౌరారం, నెలవలపల్లి, చింతపల్లి, అనాజపురం గ్రామాలలో మాత్రమే సుమారు 75 ఇండ్ల వరకు బి. ఆర్ ఎస్.ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. ఆ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి కనీసం మూడు, నాలుగు, సంవత్సరాలు దాటుతున్నప్పటికీ అర్హులైన నిరుపేదలకు అందించకుండా పంపిణీ చేయడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం జాప్యం చేయడం జరిగింది.
ప్రస్తుతం ఆ ఇండ్లు పడావు పడి గ్రామంలో దర్శనమిస్తున్నాయి. నేడు గ్రామాల్లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ, బీసీ లకు సరియైన ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల తో పాటు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా అర్హులైన నిరుపేదలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MOST READ :
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. వరుస సెలవులు..!









