BHEEMIREDDY : ఎర్ర సూర్యుడు భీమిరెడ్డి 15వ వర్ధంతి ( ప్రత్యేకం)

ఎర్ర సూర్యుడు భీమిరెడ్డి 15వ వర్ధంతి ( ప్రత్యేకం)

ఈనెల 9వ తేదీన వర్ధంతి

ఎంసీపీఐయు జాతీయ కమిటీ సభ్యుడు వరికుప్పల వెంకన్న

మనసాక్షి :

తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు ఎం సి పి ఐ యు పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి  పేరు బహుశా వినని వారు ఈ రాష్ట్రంలో ఉండరు ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అతిపెద్ద ప్రజాయుద్ధం పీడిత తాడిత జన విముక్తి కోసం గడివిడిచి గన్ను పట్టిన త్యాగధనుడు అసమాన ధైర్య సాహసాలతో ఆరంభం నుండి ఆశాంతం వరకు పోరాడి నైజం పాలనకు గురి కట్టి రజాకారుల దౌర్జన్యాలకు పాడే కట్టి వందలాది గ్రామాలను విముక్తి చేసి వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన వీరుడు అణగారిన వర్గాల ఆత్మబంధువు అలుపెరగని యోధుడు అవినీతి మరక అంటని మహా నాయకుడు మడిమ తిప్పని మహాయోధుడు గడిల దొరలను గడగడలాడించిన చెక్కుచెదరని ఉక్కుమనిషి విసుగు చందని విరామము ఎరగని విప్లవ వీరుడు అస్తమించిన ఎర్ర సూర్యుడు బి.ఎన్.రెడ్డి.

 

భారత విప్లవ ఉద్యమానికి ఎర్రజెండానందించిన తెలంగాణ రైతాంగ పోరాటంలో తొలి ఆయుధాన్ని చేపట్టి ప్రజా ఉద్యమాన్ని కదం తొక్కించి ఎర్ర విత్తనాలు నాటిన భీమిరెడ్డి ఎల్లప్పుడూ ప్రజల హృదయములో నిలిచే ఉంటారు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా భూ పంపిణీ కోసం చేసిన పోరాటాలకు అధ్యుడు చివరి వరకు పేదల పక్షపాతిగానే నిలిచారు కమ్యూనిస్టుల పై దాడి చేసేందుకు ఢిల్లీ నుండి యూనియన్ సైన్యం వస్తుందని పసిగట్టి ఆనాడే అత్యాధునిక సాంకేతిక పోరాట పద్ధతులను అవలంబించారు.

 

భీమిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచం గర్వించదగ్గ ప్రజా పోరు ముండ్రాయిలో లంబాడీల బతుకు పోరాటం పాలకుర్తిలో చాకలి ఐలమ్మ బువ్వ గింజల పోరాటం లో బి ఎన్ ముందుండి పోరాడినారు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా నేటి ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో 1922లో భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన ఆలోచనలు పేదల చుట్టూ తిరుగుతుండేవి ఆంధ్ర మహాసభ సభ్యునిగా జీవితం ప్రారంభించిన భీమిరెడ్డి ఆ తర్వాత కమ్యూనిస్టుగా మారారు 20 ఏళ్ల వయసులో స్వగ్రామంలో ఎట్టి చాకిరి కి వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్టు అయ్యారు.

 

అక్రమ లెవీ వసూళ్లకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసి నిర్బంధానికి గురయ్యారు భూస్వాముల గుండాలను ఎదిరించి పేదల పక్షపాతిగా నిలిచిన భీమిరెడ్డి ఎందరో యువకులకు సాయిధ శిక్షణ ఇచ్చి వారిని పోరాటపందా వైపు నడిపారు దున్నేవాడిదే భూమి అనే నినాదంతో అనేక గ్రామాలలో భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్యక్రమం రూపకల్పన చేసిన నాయకులు భీమిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి బి ఎన్ 16 పోలీస్ స్టేషన్లో పై దాడులు నిర్వహించి 1948 మే 19న రజాకారుల క్యాంపు లపై దాడి చేసిన పోరాట యోధుడు రజాకారుల వ్యతిరేక పోరాటానికి యువతను సమీకరించి వారిలో ధైర్యాన్ని నూరిపోశారు 1951లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించినట్లు ప్రకటించిన చాలా కాలం వరకు బి ఎన్ ఆయుధాన్ని దించలేదు అందుకే ఆయన అలుపెరుగని అవిశ్రాంత పోరాట యోధుడు.

 

1952లో సూర్యాపేట నుండి 1957లో నాగారం నుండి అసెంబ్లీకి మిర్యాలగూడ పార్లమెంటుకు 1971 1984 1991లో ఎన్నికైనారు ప్రజల సమస్యను తన సమస్యగా భావించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బీబీనగర్ నుండి రామన్నపేట చిట్యాల నుండి మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని పోరాడి సాధించిన మహనీయుడు వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని చుక్కనీరు లేక ఎడారిగా మారిన వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా బీడు భూములకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారంగా ప్రజలకు త్రాగునీరు పంట పొలాలకు సాగునీరు అందించాలని 1996 మార్చి 6న శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు తిరుమలగిరి ప్రగతి నగర్ వద్ద స్వయంగా దగ్గర ఉండి శంకుస్థాపన చేయించి పార్లమెంట్లో బడ్జెట్ కేటాయించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అధికారులతో చర్చలు జరిపి కాలువలు త్వరగా పూర్తి చేయాలని గోదావరి నీరు చూసి తీరుతానని కాలువలు పూర్తి అయిన తర్వాత నీరు చూసి విశ్రాంతి తీసుకుంటానని 88 సంవత్సరాల వృద్ధాప్యంలో సైతం గోదావరి నీటి కోసం పోరాటం చేశారు త్యాగజీవి ధన్యజీవి నీతిమంతుడు అగ్రగామి పోరాటయోధుడు ప్రజలే ఆయన లక్ష్యం పీడిత ప్రజల సంక్షేమమే ఆయన ఉత్వాస వారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డు ప్రధానం చేసింది సుదీర్ఘ రాజకీయ రంగంలో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లచే అనేకసార్లు సన్మానం పొందారు.

 

బి.ఎన్ జీవితాంతం నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపి ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచారు ఒక్క పార్టీకి నాయకునిగా ఉన్న భీమిరెడ్డి ఇతర పార్టీ రాజకీయ నాయకులను ఏనాడు వ్యక్తిగత ద్వేషంతో చూడలేదు

మార్క్సిస్టు పార్టీలో మూడుసార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు బి ఎన్ తన సేవలను అందించారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో 1996 శాసనసభ ఎన్నిక సందర్భంగా సామాజిక న్యాయం అంశంపై మార్క్సిస్టు పార్టీ సిపిఐఎంలో చీలిక వచ్చింది తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అభ్యర్థి మల్లు స్వరాజ్యం రెడ్డిని నిలపాలన్న పార్టీ నాయకత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా వర్ధిల్లి బుచ్చి రాములు గౌడ్ కు అసెంబ్లీ అభ్యర్థిగా కేటాయించాలని ఎప్పుడు ఆస్థానం భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం భీమ్ రెడ్డి కుశలవ రెడ్డి లకేనా అంటూ భీమిరెడ్డి నరసింహారెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు.

 

దీంతో సిపిఐఎం పార్టీ ఆది నాయకత్వం అహిష్టంగా ఆ సీటు బుచ్చి రాముల కు ఇవ్వక తప్పలేదు ఆ ఎన్నికల్లో బుచ్చి రాములు గౌడ్ 700 ఓట్లతో ఓడిపోవడం జరిగింది అందుకు మల్లు స్వరాజ్యం మల్లు వెంకట నరసింహారెడ్డి కారణమంటూ సామాజిక న్యాయ గ్రూపు గా ఉన్న దళిత నాయకత్వం సిపిఐఎం పార్టీ నుంచి విడిపోయి సామాజిక న్యాయం పేరిట 1996 సంవత్సరంలో సిపిఎంబిఎన్ పార్టీగా ఏర్పడింది తాను అగ్రకులంలో పుట్టినప్పటికీ నిమ్మ కులాల వారు పల్లకి మోసే బోయులుగా ఉండరాదని రాజ్యాధికారం చేపట్టాలని వారిలో చైతన్యం కలిగించడానికి సామాజిక న్యాయం పేరుతో 1997 డిసెంబర్ రెండవ తేదీన లక్ష మందితో సూర్యాపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్ని కులాలను వర్గాలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చిన ఘనత ఒక బి ఎన్ కు దక్కింది.

 

ఉమ్మడి రాష్ట్రంలో ఎం సి పి ఐ మాదిగ దండోరా మాల మహానాడు బీసీ సంఘాలు తుడుం దెబ్బ గిరిజన సంఘం వెనుకబడిన కులాలు శ్రమజీవులు దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు సిపిఎంబిఎన్ పార్టీలతో ఆనాడు మహాజన ఫ్రంట్ తరఫున ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని స్థానాలలో మద్ది కాయల ఓంకార్ మందకృష్ణ మాదిగ పివి రావు భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్లతో మహాజన ఫ్రంట్ తరఫున అన్ని స్థానాలకు పోటీ చేయడం జరిగింది.

 

ఫిబ్రవరి 2వ తేదీ 2000 సంవత్సరంలో సీపీఎం బి ఎన్ పార్టీని తమ తోటి సమకాలికుడు సహచరుడు అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ స్థాపించిన ఎం సిపిఐ పార్టీ లో భీమిరెడ్డి నరసింహారెడ్డి సిపిఎంబిఎన్ పార్టీని విలీనం చేశారు ఎర్రజెండా పార్టీలు పార్టీలకు తోకలు తొత్తులుగా మారి పొత్తు పెట్టుకోవడాని పూర్తిగా వ్యతిరేకించి సైదాంతిక కారణాలతో విడిపోయిన ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలని బలోపతమైన ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు కోసం కడవరకు కృషి చేసిన కురువృద్ధుడు భీమిరెడ్డి తుది శ్వాస విడిచే వరకు ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయించుటకు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆయనకు ఆరోగ్యం సహకరించుకున్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలో కూర్చుని ప్రభుత్వంలో కదిలిక తీసుకొచ్చి సమరయోధులకు పెన్షన్లు ఇప్పించిన ఘనత బి.యన్.రెడ్డిది.

 

అంతటి రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో తాను మరణించే అంతవరకు ఆటోలలో బస్సులలో ప్రయాణం చేస్తూ సొంత కారు లేకుండా పోవడమే తన నిస్వార్థ రాజకీయ జీవితం ఆదర్శానికి ఒక మచ్చుతునక సాదాసీదా జీవితం గడిపిన స్వార్థం పెరగని ధర్మం పక్షాన నిలబడ్డ ధర్మరాజు భూమి భుక్తి విముక్తి ఆయనకు పంచప్రాణాలుగా ప్రజల సమస్యలను తన సమస్యగా భావించే వీరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి.

 

అంతటి మహానేత 2008 మే 9న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని తెలిసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంఘ సేవకులు గాయకులు కవులు కళాకారులు అభిమానులు అనుచరులు సహచరులు ఎం సి పి ఐ యు అగ్ర నాయకుడు కార్యకర్తలు ప్రజలు అశేషంగా కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికి ఎం సి పి ఐ యు జండాలతో ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపి గౌరవించారు బి ఎన్ మృతితో తెలంగాణ రాష్ట్రం సాయుధ పోరాట యోధున్ని ఒక మహోన్నత నాయకున్ని కోల్పోయింది.

 

భీమిరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో హైదరాబాదులోని ఓంకార్ భవన్ బియన్ రెడ్డి గారి హాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బి.యన్.రెడ్డి విగ్రహం వద్ద ఆత్మకూర్ ఎస్ మండలంలోని దాచారం తుమ్మల పెన్ పహాడ్ క్రాస్ రోడ్డు లో భీమిరెడ్డి గారి విగ్రహం వద్ద బి ఎన్ గారి స్వగ్రామం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో బి.యన్ గారి విగ్రహం వద్ద 15వ వర్ధంతి సభలు నిర్వహించడం జరుగుతుందని

వెంకన్న తెలిపార

 

భీమిరెడ్డి సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు భీమిరెడ్డి గారి పేరు నామకరణం చేయాలని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బిఎన్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని సూర్య చంద్రుడు ఉన్నంతవరకు భీమిరెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని ప్రజలు కోరుకుంటున్నారు.

 

విప్లవ అభినందనలతో …

వరికుప్పల వెంకన్న ఎం సి పి ఐ యు జాతీయ కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు.