నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!
నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!
నల్లగొండ, మన సాక్షి :
దేశంలోనే నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం దక్కింది. 25 లక్షలు నగదు పురస్కారం కూడా అందుకుంది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎంసీఏపి) కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్, 2024 లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది.
ఎంసీఏ పి డైరెక్టర్ డా. ప్రశాంత్ మార్గదర్శకాలకు అనుగుణంగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించగా, వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సి బి సి బి) మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో, నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీలో ఒకటిగా ఎంపిక చేయడమే కాకుండా, స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్, 2024లో రెండవ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని జైపూర్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో స్వచ్ఛ్ వాయు దివస్ 2024 సందర్భంగా, నల్గొండ మున్సిపాలిటీకి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చేతులమీదుగా 25 లక్షల నగదు పురస్కారాన్ని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు.
LATEST UPDATE :
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









