Miryalaguda : ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురు వర్ధంతి..!

ఏఐకేఎఫ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్, ఏఐ ఎఫ్ డి వై నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి శనివారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురు వర్ధంతి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

ఏఐకేఎఫ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్, ఏఐ ఎఫ్ డి వై నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి శనివారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎఫ్డి వై జిల్లా అధ్యక్షులు వాస్కుల కిరణ్ అధ్యక్షతన మిర్యాలగూడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏ ఐ కె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య , నాయకులు పోతుగంటి కాశి, భరత్ మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్టులను, కార్మిక ఉద్యమాలను అనుచడానికి ప్రజా భద్రత బిల్లును, పారిశ్రామిక సంబంధాల బిల్లును తీసుకొచ్చిందన్నారు. దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో పొగ బాంబులు వేసి సంచలనం సృష్టించినారు. భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ముగ్గురు భారత విప్లవానికి నిలువుటద్దమన్నారు.

బ్రిటిష్ దుర్మార్గపు పాలనలో చిక్కుకున్న భారతదేశానికి విముక్తి కలిగించేలా దేశ ప్రజల్లో విప్లవస్ఫూర్తిని నింపిన మహా నాయకులు అన్నారు. ఆనాడు భగత్ సింగ్ మతం వ్యక్తిగత అంశంగా ఉండాలని అది రాజకీయాల్లో చొరబడి మతోన్మాద రూపం తీసుకొచ్చినప్పుడు దాని యొక్క పెద్ద శత్రువుగా ఎదుర్కొన్నట్టుగానే ఎదుర్కోవాలని భగత్ సింగ్ పిలుపునిచ్చారన్నారు.

ALSO READ : Drugs : డ్రగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు

మతం మూఢనమ్మకాల బంధనాల నుండి ప్రజలు తమంతట తాము విముక్తి కి అలవాటు పడాలి అన్నారు. 76 ఏళ్ల తర్వాత మరల ఆనాటి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం తరహాలో మరో స్వతంత్ర ఉద్యమానికి నాంది పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. బ్రిటిష్ నిర్బంధ కాండ నుంచి భగత్ సింగ్ ఆవిర్భవించినట్టుగానే నేడు కేంద్ర పాలకుల మతోన్మాద వ్యతిరేక పోరాటంలో చరిత్రను తిరగ రాస్తే కొత్తతరం ఆవిర్భవిస్తుందన్నారు. భగత్ సింగ్ లా పోరాడి దేశ సమైక్యతను కాపాడాలన్నారు.

1909 సంవత్సరం ఏప్రిల్ 13న అమృత సార్లోని జలియన్వాలాబాగ్ పార్క్ లో జనరల్ డయాగ్ చేసిన మారణకాండ భగత్ సింగ్ ని కోపోద్రికుడిని చేసిందన్నారు. విత్తనాలు నాటితే మొక్కలు మొలిచి పంటలు పండినట్టు తుపాకులు నాటితే తుపాకులు పండితే తన స్నేహితులకు పంచిపెట్టి బ్రిటిష్ దొరలను కాల్చివేయాలని చిన్న వయసులోనే కలలు కన్నాడు అని అన్నారు.

దేశ స్వాతంత్రం కోసం ఎన్ని జన్మలైనా ఎత్తి ఎన్నిసార్లు అయినా చావడానికి సిద్ధమని ప్రాణ త్యాగం చేసిన కత్తార్ సింగ్ షరాబును యుక్త వయసులోనే భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్, సుజేందర్ , హరీష్, వంశీ, సందీప్, నాని ,అజయ్, రాఘవ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!