Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!

Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!

మదనపల్లి, మన సాక్షి:

తంబళ్లపల్లె నియోజకవర్గం బురకాయలకోట గ్రామం పెద్ద మురవపల్లి వద్ద ఈనెల 12వ తేదీన ఊరి బయట ఉన్న తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న రాజా రెడ్డి హత్య జరిగింది. ఇది సంచలనగా మారింది. పోలీసులు కేసును చేదించారు. నివ్వేర పోయే నిజాలు బయట పడ్డాయి.

తన అక్రమ సంబదానికి అడ్డుగా వున్నాడని కన్న కూతురే తండ్రిని అతి కిరాతకంగా ప్రియుడి అండతో కడతేర్చిందని విచారణలో వెళ్ళడైంది. హత్యకు కారకులైన వారిని ములకలచెరువు ట్రైనింగ్ డిఎస్పి జిఎస్ ప్రశాంత్ వారి బృందంతో సోమవారం అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే…బ్రాహ్మణి అనే అమ్మాయి రాజారెడ్డి పెద్ద కుమార్తె. వివాహమై ఇద్దరు సంతానం. అక్రమ సంబంధం పెట్టుకుని తన తండ్రి అయిన బి రాజారెడ్డిని తన ప్రియుడు అరుణ్ కుమార్ తో కలిసి అతి కిరాతకంగా హత్య చేయించింది.

కని పెంచి చదువు సంద్యలు చెప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసిన రక్త సంబంధం కలిగిన కన్న తండ్రి కన్నా మధ్యలో వచ్చిన ప్రియుడు గొప్ప అయ్యాడు ఆమెకు. కన్న తండ్రి అని కూడా చూడకుండా చంపించింది. ఇది అంతటా సంచలనంగా మారింది. హత్యకు కారుకులైన బ్రాహ్మణి, ప్రియుడు అరుణ్ కుమార్ ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ALSO READ :

Doctorate : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలు హేమశ్రీకి డాక్టరేట్..!

Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!

ED : కవిత అరెస్టుపై ఈడి కీలక ప్రకటన విడుదల..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

మరిన్ని వార్తలు