Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్విద్య

Doctorate : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలు హేమశ్రీకి డాక్టరేట్..!

Doctorate : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలు హేమశ్రీకి డాక్టరేట్..!

మదనపల్లి, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా అంగల్లు సమీపంలో లోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో సిఎస్సి అధ్యాపకురాలు వి. హేమశ్రీకి కర్ణాటక కు చెందిన విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీచే డాక్టరేట్ లభించింది. ప్రిన్సిపాల్ డా. కే సందీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో లో పిహెచ్ డి పూర్తి చేశారు.

కంప్యూటేషనల్ మోడలింగ్ ఆఫ్ ఫేసియల్ స్కిన్ టెక్సర్ బేస్డ్ ఆన్ రింకుల్స్ యుసింగ్ ఇమేజ్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ అనే అంశంపై డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ యాప్ ద్వారా మనిషి యొక్క వయసు తెలుసుకొనవచ్చు, మరియు ముఖం లో వచ్చే చర్మ మార్పుల గురించి తెల్సుకొనవచ్చు, ముఖ్యంగా చర్మ సమస్య లు తెలుసుకొనటానికి ఉపయోగ పడుతుంది.

ఈ అప్లికేషన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కు ఎంత గానో ఉపయోగపడుతుందని హేమశ్రీ తెలిపారు. హేమశ్రీ డాక్టరేట్ పొందినందుకు కళాశాల చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.

ALSO READ : 

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

ACB : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..!

BREAKING : శివరాత్రి పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి..!

మరిన్ని వార్తలు