మిర్యాలగూడలో భారత్ బంద్..!
మిర్యాలగూడలో భారత్ బంద్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యములో ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా మిర్యాలగూడ లో బంద్ పాటించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సముదాయాలను , ప్రభుత్వ ప్రయివేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మాల మహానాడు ఆద్వర్యంలో బంద్ చేయించారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తీర్పును వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద యెత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పన నగేష్, మాల మహానాడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగటి జోసెఫ్, మాల మన రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నప్ప, విద్యార్థి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, వీరు, గిరి, వాస ఎంకన్న, చింతమల్ల దివ్య, తాళ్లపల్లి నాగయ్య, మర్రి జోజి, వాస చైతన్య, వాస శోభ కోడి రెక్క మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Miryalaguda : ఆయకట్టులో కూలీల కొరత.. జోరుగా వరినాట్లు..!
అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!
మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!









