Miryalaguda : భార్గవ్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా పుట్టినిల్లు.. ఙానారెడ్డి బై ఎలక్షన్ లో వ్యతిరేక ప్రచారం ఎలా చేశారు..!

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తీరు నగరు భార్గవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ పార్టీ అధిష్టానం ఆయన చేరికను నిలిపివేయడం.. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

Miryalaguda : భార్గవ్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా పుట్టినిల్లు.. ఙానారెడ్డి బై ఎలక్షన్ లో వ్యతిరేక ప్రచారం ఎలా చేశారు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తీరు నగరు భార్గవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ పార్టీ అధిష్టానం ఆయన చేరికను నిలిపివేయడం.. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడు అర్జున్ పొదిలా శ్రీనివాస్ మాట్లాడుతూ జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న భార్గవ్ కు ఇప్పుడే పుట్టినిల్లు గుర్తొచ్చిందా.. అని ఎద్దేవా చేశారు.

నాగార్జునసాగర్ బై ఎలక్షన్ సందర్భంలో జానారెడ్డి పోటీ చేస్తే అక్కడికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భం గుర్తు చేశారు. జానారెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న భార్గవ్ అక్కడ వ్యతిరేక ప్రచారం ఎలా చేశారని ఆయన వారు ప్రశ్నించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజారిటీ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని తమ పార్టీలోకి ఎవరు రావలసిన అవసరం లేదన్నారు.

ఎన్నికల ముందు వ్యతిరేక ప్రచారం చేసిన వారు తమ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకోవడం సరైనది కాదన్నారు. నిజంగా రఘువీర్ కు సహాయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే చేరాల్సిన అవసరం లేదని.. ఎక్కడ ఉన్నా కూడా గెలిపించే అవకాశం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అటువైపు వెళ్లినవారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించిన సమయంలో వారికి సొంత పార్టీ గుర్తు రాలేదా అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా సమిష్టిగా , సమైక్యంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమ సమిష్టిని దెబ్బతీసే విధంగా చర్యలు ఉండకూడదు అన్నారు. మున్సిపాలిటీ దోచుకొని సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడని విషయం పట్టణంలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. కాకమ్మ కబుర్లు చెప్తే పట్టణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి వద్దన్నా వస్తామని చెప్పడం వారికి సిగ్గుచేటు అన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, గంధం రామకృష్ణ ,జావిద్, రవి నాయక్, జలంధర్ రెడ్డి, చల్ల వెంకన్న ,గుంజ శ్రీనివాస్, కోడి రెక్క ఇంద్ర కుమార్, మాజీ కౌన్సిలర్లు శనగోని యాదగిరి ,బల్గురు శ్రీనివాస్, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్, సలీం, మరియు వార్డు కౌన్సిలర్లు ఇన్చార్జిలు పాల్గొన్నారు.

ALSO READ : 

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

Miryalaguda : బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ బార్గవ్..!