Miryalaguda వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి పెద్ద మసీద్.. కమిటీ రద్దు..!
Miryalaguda వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి పెద్ద మసీద్.. కమిటీ రద్దు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మస్జిద్ సరాయే మీరాలం కమిటీ గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) టాస్క్ ఫోర్స్ మహమ్మద్ ఆరీఫ్ అలీ ఖాన్ పర్యవేక్షణలో నల్లగొండ జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆడిటర్ ఎండి.మహిమూద్ నిర్వహణ బాధ్యతలు శనివారం చేపట్టారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాలతో అధికారులు మిర్యాలగూడకు చేరుకుని ఆగస్టు 2024లో కమిటీ పదవీ కాలం ముగిసిన అధ్యక్షుడు ఎండి. మహమూద్ ఆలీకి ఫోన్ చేసి పిలిచిన రాకపోవడంతో పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి బాధ్యతలు చేపట్టారు.
మస్జిద్ గదులలో, దుకాణాలలో ఉన్న వారు అద్దె వక్ఫ్ ఇన్స్పెక్టర్ కు ఇవ్వాలని కోరారు. గత 36 సంవత్సరాలుగా ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ప్రార్థనలకు వచ్చే వారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, కలెక్టర్, సబ్ కలెక్టర్, బోర్డు చైర్మన్, సిఇఒకు ఫిర్యాదు చేయగా అధికారులు కదిలి వచ్చారు.
కమిటీకి ఎన్నికల కోసం ప్రకటన జారీ చేస్తామని, పోటీ చేయాలనుకునే వారు ఏకగ్రీవంగా ఒక ప్యానెల్ సమర్పిస్తే వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని రెండు, మూడు ప్యానెల్స్ వస్తే ఎన్నిక నిర్వహిస్తామని ఓఎస్డి పేర్కొన్నారు. మస్జిద్ కు వచ్చే వారి ఓటర్ జాబితా సిద్ధం చేసి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ ఇబ్రహీం, లీగల్ అడ్వైజర్ ఎండి.ఇమ్రాన్, సర్వేయర్ ఎండి.వాజిద్, ముసలియన్లున్నారు.
MOST READ :
-
Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!
-
TG News : రాహుల్ గాంధీ కులం పై చర్చ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్.. (వీడియో)
-
Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!
-
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!









