Miryalaguda : అంగన్వ్వాడీ టీచర్ సాగర్ కాల్వలో గల్లంతులో బిగ్ ట్విస్ట్.. ప్రమాదంగా చిత్రీకరించిన భర్త..!
Miryalaguda : అంగన్వ్వాడీ టీచర్ సాగర్ కాల్వలో గల్లంతులో బిగ్ ట్విస్ట్.. ప్రమాదంగా చిత్రీకరించిన భర్త..!
వేములపల్లి, అక్టోబర్ 10, మన సాక్షి :
భార్యను సాగర్ ఎడమ కాలువలో తోసేసి ప్రమాదకరంగా జరిగిందని చిత్రీకరించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో చోటుచేసుకుంది.
వేములపల్లి మండలం రావువారిగూడెం గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ పై అనుమానం పెంచుకొని ఆమెను తన బైక్ పై రావులపెంట గ్రామ శివారులోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ బ్రిడ్జి వద్దకు తీసుకొని పోయి అక్కడ ఆమెను బలవంతంగా కాలువలోనికి నెట్టివేసి చంపిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేయునైనది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావువారిగూడెం గ్రామానికి చెందిన పేరబోయిన సైదులు సుమారుగా 16 సంవత్సరాల క్రితం మిర్యాలగూడకు చెందిన కుమ్మరి అనూష అనే అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం కలిగినారు. అనూష ప్రస్తుతం రావువారిగూడెంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేయుచు కామేపల్లి అంగన్వాడి సెంటర్ కు ఇన్చార్జి కూడా పనిచేయుచున్నది.
ఆమె భర్త నేరస్తుడు సైదులు గత కొన్ని రోజులుగా ఆమెను అనుమానిస్తూ పలుమార్లు ఆమెను కులం పేరుతో తిడుతూ ,కొడుతూ, వేధించాడు. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు పెద్దమనుషులతో కూడా పలుమార్లు పంచాయతీలు కూడా చేసి అతనికి హెచ్చరించి చెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
ఆమె పై అనుమానంతో ఒక పథకం ప్రకారం.. ఈనెల 5వ తేదీన సాయంత్రం చీకటి పడే సమయంలో అతడు ఆమెను కామేపల్లి నుండి తన బండి పై ఎక్కించుకొని గొడవలు పడుతూ వస్తున్న క్రమంలో రావులపెంట గ్రామ శివారులోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ బ్రిడ్జి వద్దకు తీసుకొని పోయి అక్కడ బండి ఆపి ఆమెను చెంపపై కొట్టి బలవంతంగా కాలువలోనికి నెట్టివేసి చంపి ఎవ్వరికీ తనపై అనుమానం రాకుండా తన బండిని కూడా తానే కాలువలో పడవేసి అనంతరం అతడు కాలువలోకి దూకి ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రమాదషవత్తు కాలువల్లో పడి చనిపోయినట్లు నమ్మించే యత్నం చేసినాడు.
మంగళవారం మృతురాల శవం పొనుగోడు రిజర్వాయర్ పక్కన గల చిన్న చెరువులో తేలినది. ఇట్టి కేసుల్లో నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి కె రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూలర్ సిఐ వీరబాబు , వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు , మాడుపల్లి ఎస్సై కృష్ణయ్య , మరియు వారి సిబ్బంది నేరస్తుని అరెస్టు చేయడం జరిగింది.
MOST READ :









