Nalgonda : బిజెపికి 400 సీట్లు రావడం ఖాయం..!

నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర సభలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ దేశ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు రావడం ఖాయమని అన్నారు.

Nalgonda : బిజెపికి 400 సీట్లు రావడం ఖాయం..!

సంకల్పయాత్ర ముగింపు సభలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్

నల్లగొండ , మనసాక్షి :

నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర సభలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ దేశ ప్రజలు బిజెపి
వైపు చూస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు రావడం ఖాయమని అన్నారు. విజయ సంకల్ప యాత్ర జనాధారణ వెళ్ళు ఎత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి వైపు ప్రజా ధారణ ను చూసి భయంతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని ఆయన మండిపడ్డారు.

టిఆర్ఎస్ బిజెపి పొత్తు అని పొంతన లేని మాటలతో ప్రజల్లో మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్లమెంట్ సీట్లు గెలవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని నేడు దేశానికి ఆదర్శం నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చునులో విఫలమవుతున్నారని మండిపడ్డారు.

500 కు సిలిండర్ అమలు చేస్తున్నారంటూ మొదటగా మొత్తం డబ్బులు చెల్లిస్తే బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ అమౌంటు పడడం జరుగుతుందని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. వారు మాట్లాడే మాటలకు చేతలకు పొంతన లేనిది ఎద్దేవా చేశారు. దేశంలో సంక్షేమ పథకాలకు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న ఎక్కడ వాటి ప్రచారం చేయడం లేదని మండిపడ్డారు. జాతీయ రహదాలకు త్వరలోనే నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని సూచించారు.

వికసిత్ భారత్ పేరిట రాబోయే 20 సంవత్సరాల్లో మన దేశం నరేంద్ర మోడీ తీసుకునే అనేక విప్లమాత్మక మైన నిర్ణయాలతో దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ గా ఎదుగుతుందని అన్నారు. 500 సంవత్సరాలు హిందువుల క ల అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కేవలం బిజెపితోనే నరేంద్ర మోడీ కటోర శక్తి, అంకుటిత దీక్ష ద్వారా నే సాధ్యమైందని పేర్కొన్నారు దేశ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే నరేంద్ర మోడీ ని మూడవసారి ప్రధానిగా ఎన్నుకోవాలని వచ్చే ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకోవాలని ప్రజలు ఒకసారి బిజెపి నీ ఆదారించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలోడాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు. మాద గాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి , గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంద్రశేఖ ర్రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,గార్లపాటి జితేందర్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బండారు ప్రసాద్ పార్లమెంట్ కన్వీనర్, పొతేపాక సాంబయ్య ,పెరిక మునికుమార్, దాయం భూపాల్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్, కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీమతి శ్రీదేవి రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. బక్రం శ్రీను పాల్గొన్నారు.