Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్ల బెల్లం భారీగా పట్టివేత.. దాడిలో పాల్గొన్న హైదరాబాద్ ఎస్టిఎఫ్ టీం..!

Miryalaguda : నల్ల బెల్లం భారీగా పట్టివేత.. దాడిలో పాల్గొన్న హైదరాబాద్ ఎస్టిఎఫ్ టీం..!

నల్లగొండ,  మన సాక్షి:

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని జమ్మన కొండ తండాలో అక్రమంగా ఒకచోట నల్ల బెల్లం దాసి ఉంచారనే సమాచారం మేరకు గురువారం హైదరాబాద్ కు చెందిన ఎస్టిఎఫ్ టీం లీడర్ ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి బెల్లం దాసి ఉంచినటువంటి గోదాము పై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో 300 కేజీల బెల్లం 50 కేజీల ఆలం,10 లీటర్ల నాటు సారా పట్టుబడింది. ఆంధ్రకు చెందిన గుంటూరు మాచర్ల కు చెందినటువంటి కృష్ణా నాయక్ అనే ఒక వ్యక్తి నాటు సారా తయారీ కోసం వినియోగించే నల్ల బెల్లాన్ని అమ్మకాల కోసం ఈ గోదాంలో దాచిపెట్టి ఉంచాడు.

పట్టుబడినటువంటి నల్ల బెల్లం ఆలం విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ ఎస్టిఎఫ్ బాలరాజు సిబ్బంది, అలియా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ కల్పన ఎస్సై సంపత్ పాల్గొన్నారు. బెల్లం పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావులు అభినందించారు.

(Reporting : Shekar, ManaSakshi, Nalgonda)

LATEST UPDATE :

మరిన్ని వార్తలు