తెలంగాణBreaking Newsక్రైంనల్గొండ

వ్యవసాయ బావి వద్ద వరుసగా బోరు మోటర్లు, విద్యుత్తు వైర్లు చోరీలు..!

వ్యవసాయ బావి వద్ద వరుసగా బోరు మోటర్లు, విద్యుత్తు వైర్లు చోరీలు..

గుర్రంపోడు, మనసాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో ఎస్ ఎల్ బి సి కెనాల్ లో మోటార్స్ ద్వారా వ్యవసాయానికి నీళ్లు వాడుకుంటున్నారు. నలుగురికి కడుపు నింపుదాము అనుకున్న రైతాంగానికి కంటిమీద కునుకు లేదు నిత్యం సాటర్లు కేబుల్ వైర్లు మోటార్స్ దొంగతనానికి గురవుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దొంగలు తన చేతికి పని చెప్పారు.

వివరాలు వెళ్తే దోటి గణేష్ దోటి శంకర్ సిలివేరు యాలాద్రి యొక్క రైతులు కేబుల్ వైర్స్ దొంగతనానికి గురయ్యాయి ఒక్కొక్క రైతు 30 నుంచి 40 మీటర్ల గల వైర్లు దొంగతనానికి గురయ్యాయి. గుండెబోయిన యాదయ్య ఐదు ఆస్పరల మోటారు కేబుల్ వైర్లు దొంగలు కత్రించక పోయారు. మంగళవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు.

వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్ చోరి కత్తిరించిన మోటార్ కేబుల్ వైరుని చూపిస్తున్న రైతులు మోటార్లకు వైర్లు లేక లబోదిబోమంటున్న రైతులు చామలేడులో ఇది మూడోసారి చోరీ జరిగింది. ఇలా కత్తిరించిన కేబుల్ వైర్లను కాళీ ప్రదేశంలో మంట వేసి కాల్చి అందులో వచ్చిన రాగి తీగను ఎత్తుకుపోయారని రైతులు చెప్పారు.

గతంలో మూడుసార్లు కేబుల్ వైర్లు కట్ చేశారని రైతులు చెబుతున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పంటలకు నీరు పెట్టాలంటే మళ్లీ ప్రతి రైతుకు 4 000 నుంచి 5000 రూపాయలు ఖర్చు చేసి కేబుల్ వైర్లు కొనాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటినుండి పోలీసులు రాత్రి సమయంలో గట్టిగా పెట్టాలని దొంగలను పట్టుకొని దొంగతనని అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు. సాటరు మోటర్ వైర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాము రైతులు చెప్పారు.

MOST READ ; 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

  3. Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్‌..!

  4. Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

  5. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు