Uncategorized
BREAKING : మద్యం మత్తులో భార్య, కొడుకొని చంపేశాడు..!
మద్యం మత్తులో భార్య పిల్లలను చంపిన సంఘటన ఆమనగల్లు రక్షక భట నిలయ పరిధిలో చోటుచేసుకుంది.

BREAKING : మద్యం మత్తులో భార్య, కొడుకొని చంపేశాడు..!
మనసాక్షి, ఆమనగల్లు :
మద్యం మత్తులో భార్య పిల్లలను చంపిన సంఘటన ఆమనగల్లు రక్షక భట నిలయ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని సీతారాంనగర్ తండా గ్రామ పంచాయతీలోని పులిగోని పల్లి తండాలో సోమవారము రాత్రి భార్యా భర్తల మధ్య ఏదో గొడవ జరగడంతో భర్త క్షణికావేశంలో తన భార్య కవిత, కుమారుడు హర్షను రాందాస్ చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు ప్రణీతను ఆసుపత్రికి తరలించారు. స్థానిక రక్షక భటులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.







