Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

BREAKING : దేవరకొండ – నల్గొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు..!

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకొండ - నల్గొండ ప్రధాన రహదారిపై శాంతినగర్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టింది.

BREAKING : దేవరకొండ – నల్గొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకొండ – నల్గొండ ప్రధాన రహదారిపై శాంతినగర్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాదులోని సరూర్ నగర్‌కు చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. TS 09 EE9972 నంబర్ గల కారు దేవరకొండ నుండి నల్గొండ వైపు అతివేగంగా వెళ్తోంది. శాంతినగర్ వద్ద ఉన్న మలుపులో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న పెద్ద చెట్టును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

కారు లోపల యువకుడు ఇరుక్కుపోవడంతో మృతదేహాన్ని వెలికి తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.మృతుడు తన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ విషాదం జరిగిందని సమాచారం. ప్రమాద సమయంలో కారు అత్యంత వేగంతో ఉండటం వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న గుర్రంపోడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సదరు ప్రాంతంలో గతంలోనూ అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

MOST READ 

  1. MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

  2. Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!

  3. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు