Breaking Newsక్రైంజాతీయం

BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!

మహారాష్ట్రలోని భారామతిలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఘోర విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్ సిపి నేత అజిత్ పవర్ (66) ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాష్ అయ్యి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది.

BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

మహారాష్ట్రలోని భారామతిలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఘోర విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్ సిపి నేత అజిత్ పవర్ (66) ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాష్ అయ్యి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది.

ఆయన జిల్లా పరిషత్  ఎన్నికల సందర్భంగా బారామతిలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా భారామతికి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారు. పొగ మంచు కారణంగా అత్యవసర లాండింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజయ్ పవర్ తో సహా ఆరుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది.

ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:45 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ తో పాటు ఇద్దరు వ్యక్తిగత సలహాదారులు, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా విషాదఛాయలు అనుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

  1. BIG BREAKING : మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్..!

  2. కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!

  3. BIG BREAKING : 8 మంది మావోయిస్టుల లొంగుబాటు..! 

  4. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మరిన్ని వార్తలు