Breaking News : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి, మరో యువకుని మృతి..!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్గొండలో ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వస్తుండగా స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థితో పాటు మరో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపిన వివరాల ప్రకారం..

Breaking News : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి, మరో యువకుని మృతి..!
నల్లగొండ, మన సాక్షి:
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్గొండలో ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వస్తుండగా స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థితో పాటు మరో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపిన వివరాల ప్రకారం..
శాలిగౌరారం మండలం బండమీది గూడ గ్రామానికి చెందిన గైగుల్ల వంశీ సోమవారం నల్లగొండలో పరీక్ష రాయడానికి స్ప్లెండర్ బైక్ పై తన బావమరిది గుడిసె రవిని తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలోని చందన పెళ్లి వద్ద ఎదురుగా వస్తున్న నల్లగొండకు చెందిన ఎస్పిఆర్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇంటర్ విద్యార్థి వంశీ అతని బావమరిది గుడిసె రవిలకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మరణించినట్లు రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపారు.
ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ గుర్రం కృష్ణయ్య నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా బస్సులు నడుపుకుంటూ అకస్మాత్తుగా యూటర్న్ చేసుకుంటూ బైక్ కు టక్కరిచ్చినట్లు ఎస్సై తెలిపారు వంశీ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.