Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

BREAKING : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

BREAKING : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డ్ మర్రిపల్లి గ్రామానికి చెందిన నంది శంకరయ్య (57)సంవత్సరాల వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. మృతునికి వివాహం కాలేదు తనకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటు జీవిస్తున్నాడు.

సెప్టెంబర్ 24 వ తేదీన రోజుమాదిరిగా గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద గల వేపచెట్టుకు ఉన్న పుల్లలు పండ్లు తోముకోవడానికి విరుసుకునేందుకు వెల్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో బందువుల ఇండ్లలో వెతికిన జాడ దొరకలేదు.

మంగళవారం రోజున వ్యవసాయ బావిలో శవం ఉండటంతో వెల్లి చూసే సరికి శంకరయ్యదిగా ఇంట్లో వాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదుదారుడు మృతుడి అన్న రాజలింగు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్షెట్టిపేట్ ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు