బీఆర్ఎస్ నేతల నివాసాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

బీఆర్ఎస్ నేతల నివాసాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్, మన సాక్షి :

అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. గురువారం వరుసగా రెండవ రోజు దాడులు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి తో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటి దాడులు కొనసాగుతున్నాయి.

 

ALSO READ : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని పైల్ల శేఖర్ రెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. జెసి బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్ పేటలోని కార్పొరేట్ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేపడుతున్నారు. జెసి స్పిన్నింగ్ మిల్స్, జెసి బ్రదర్స్ హోల్డింగ్స్, మర్రి ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి వ్యాపార సంస్థలలో కూడా ఐటి దాడులు చేపడుతున్నారు.

 

ALSO READ : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరులో పైపుల కంపెనీలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు పేరుతో ఉన్న కంపెనీల లో కూడా కొనసాగుతున్నాయి. ముగ్గురు కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటి సంస్థలు గుర్తించాయి. పైల్ల శేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్స్ సైతం ఐటి అధికారులు ఓపెన్ చేసినట్లు సమాచారం.