గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు

గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు

చౌటుప్పల్., మన సాక్షి.

బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని తొమ్మిదవ వార్డులోని 20 మంది యువకులు 9వ వార్డులో ఉన్న బుడ్డ మల్లికార్జున్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు.

 

పార్టీలో చేరిన యువకులలో మత్స్యసాగర్, మనిగే శివ, సంతోష్ కుమార్, సురేష్, అపరబోయిన నవీన్, గాదే నవీన్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, భీమిడీ రామిరెడ్డి, రమేష్ గౌడ్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

3. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

4. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!