మిర్యాలగూడ : 26న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, హాజరుకానున్న హరీష్ రావు

మిర్యాలగూడ : 26న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, హాజరుకానున్న హరీష్ రావు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈనెల 26న పలు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాల అనంతరం పట్టణంలోని స్థానిక ఎన్‌ఎస్‌పి క్యాంపు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొనున్నారని ఎమ్మెల్యే భాస్కర్ రావు పేర్కొన్నారు.
ఆత్మీయ సమ్మేళనం సభ ప్రాంగణాన్ని మంగళవారం మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఎన్ బిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు సిద్ధార్థ, కౌన్సిలర్ ఉదయ భాస్కర్ నాయకులు వింజం శ్రీధర్ ఖాదర్, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మంత్రుల పర్యటన వివరాలను తెలియజేశారు.
ఈనెల 26న మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని వేములపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రూ.20 లక్షల తో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు. ఉదయం 10-15 నిమిషాలకు మిర్యాలగూడ పట్టణంలోని 6 వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తి దావకాన ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10-30 కు మిర్యాలగూడ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రిలో రూ 14 కోట్లతో నిర్మించనున్న నూతన వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
ఉదయం 11-00 గంటలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ 5 కోట్ల 60 లక్షలతో మంజూరైన 28 నూతన పి హెచ్ సి సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేనున్నారని తెలిపారు. అనంతరం ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సభ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.