కాలిపోయిన టమాటా సీడ్ కట్టెలు.. రూ.1.65 లక్షల నష్టం..!
టమాటా సీడ్ కట్టెలకు నిప్పంటించడంతో కాలి బూడిదైన సంఘటన కురబలకోట మండలం కవుతంపల్లి సమీపంలో శనివారం వేకువ జామున చోటు చేసుకుంది.

కాలిపోయిన టమాటా సీడ్ కట్టెలు.. రూ.1.65 లక్షల నష్టం..!
మదనపల్లి, మన సాక్షి :
టమాటా సీడ్ కట్టెలకు నిప్పంటించడంతో కాలి బూడిదైన సంఘటన కురబలకోట మండలం కవుతంపల్లి సమీపంలో శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. బాధిత రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… మండలంలోని అంగళ్ల గ్రామం కవుతంపల్లికి చెందిన ఆవుల రవీంద్రకు సమీపంలోని బైపాస్ పక్కన పొలంలో ఏడు వేల టమాటా సీడ్ కట్టెలు నిల్వ చేశారు.
శనివారం వేకువ జామున మంటలు వ్యాపించాయి. తెలిసిన వారు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. కళ్లెదుటే రైతు కష్టార్జితం మంటల్లో కాలిపోవడంతో నిస్సహాయుడిగా మారాడు. రూ.1.65 లక్షల విలువ చేసే కట్టెలు పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతుకు నష్టం వాటిల్లింది.
ఇతనికి మరో రైతుతో మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ కారణం చేతే గుర్తు తెలియని వారు టమాటా కట్టెలకు నిప్పంటించి ఉంటారని బాధిత రైతు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు.
By: Kodanda Ramreddy, Madanapalle
MOST READ
Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!
TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!
TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!
Damaracharla : పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!









