Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Crime News : భార్యను హత్య చేసిన కసాయి భర్త..!

Crime News : భార్యను హత్య చేసిన కసాయి భర్త..!

మల్లాపూర్, (మన సాక్షి)

భార్య పై అనుమానం తో హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లో చోటుచేసుకుంది. పోలీసులు తెలుపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా  మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన వెలుమల రమేష్( 35) , కులం తెనుగు అనునతనికి 2015 వ సం, అల్లిపూర్ గ్రామానికి చెందిన సునీత (26 ) తో వివాహం అయింది. వారికి ఒక కూతురు (8) ఒక కొడుకు (6) కలరు. రమేష్ ఉపాది నిమిత్తం దుబాయ్ దేశం వెళుతూ ఉంటాడు.

రమేష్ సుమారు నెలరోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చినాడు అప్పటినుండి తన భార్య సునీతను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ తిట్టడం కొట్టడం చేస్తూ ఉండేవాడు. అయిన కూడా అతనికి అనుమానం తీరకపోవడంతో..

బుధవారం ఉదయం రమేష్ తన భార్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని గొడవ పెట్టుకుని తన భార్యను ముక్కుపై, ఎడమ కన్ను పై కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైనది. ఆమె గొంతు పిసికి చంపివేసినాడు. సునీత తండ్రి మందుల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది. సంఘటన స్థలాన్ని మల్లాపూర్ ఎస్పై కిరణ్ కుమార్ , మెట్ పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు , కోరుట్ల సి ఐ సురేష్ బాబు పరిశీలించారు.

MOST READ : 

 

మరిన్ని వార్తలు