రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి

రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి

వలిగొండ , మన సాక్షి:

వలిగొండ మండల పరిధి లోని పులిగిల్ల వీరవెల్లి గ్రామాల మధ్య రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు ప్రత్యక్ష కథనం ప్రకారం వివరాల్లోకెళ్తే ..

 

మండలానికి చెందిన వెలువర్తి గ్రామానికి చెందిన కడవేరి వీరస్వామి( 60) తన భార్య విజయలక్ష్మి మనవరాలు తో తన టీవీఎస్ ఎక్సెల్( టీఎస్ 30 1562మోపేడు బండిమీదమీద యాదగిరిగుట్ట లోని తమ బంధువుల ఫంక్షన్ కి హాజరవడానికి వెళ్తూ పులిగిల్ల ఐకెపి సెంటర్ వద్దకు రాగానే, పులిగిల్ల వ్యవసాయ మార్కెట్లో ఇన్ నక్కల యాదిరెడ్డి తన పని ముగించుకొని తన టీవీఎస్ ఎక్స్ ఎల్( టీఎస్ 30ఏ 7930)బండిమీద రోడ్డుపైకి ఎక్కుచుండగా రోడ్డుపై నుంచి వచ్చే బండిని చూసుకోక ఢీకొట్టడం జరిగింది.

ALSO READ : Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం

దీనితో వీరస్వామి ఒక్కసారిగా కింద పడిపోవడంతో తారు రోడ్డుపై తలపడి తల పగిలింది తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీనిపై భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేటకు తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు