బిగ్ బ్రేకింగ్ : ఎల్బీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

బిగ్ బ్రేకింగ్ : ఎల్బీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాదులోని ఎల్బీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాఆర్ ఓ మెన్ పాత కార్ల గ్యారేజీలో వంటలు అలుముకొని భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

 

సుమారు 50 కి పైగా పాత కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యారేజీ లో ఉన్న సిలిండర్ పేలడంతో మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు ఆర్పుతున్నారు.

 

అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగలతో భారీ శబ్దాలతో కార్ల గ్యారేజీ పూర్తిగా తగలబడింది. చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు.