తండ్రియాలలో బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి చల్మేడ కు నిరసన సెగ..!

అధికార పార్టీ శాసనసభ్యులకు ప్రజలు నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారిని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తున్నారు.

తండ్రియాలలో బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి  చల్మేడ కు నిరసన సెగ

దళిత బంధు,సిసి రోడ్లపై నిలదీత

కథాలపూర్, (మనసాక్షి)

అధికార పార్టీ శాసనసభ్యులకు ప్రజలు నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారిని నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలోని కథాలపూర్ మండలం తండ్రియాల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి చల్మేడ లక్ష్మీ నరసింహరావు తో పాటు మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ కు నిరసన సెగ తగిలింది.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

తండ్రియాల గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మేడా లక్ష్మీ నరసింహరావు కు గ్రామంలో ఉన్న యువకులు, మహిళలు అనర్హులకు, పైరవీకారులకు, డబ్బులు ఇచ్చిన వారికే దళిత బంధు, బిసి బంధు ఇచ్చారంటూ, అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

2018 లో ఎలక్షన్ లో గ్రామంలో ప్రతి వీధికి సిసి రోడ్డులు వేస్తామని హామీలతో వచ్చి ఓట్లు వేయించుకొని వెళ్లిపోయారని అప్పుడు మేము గుర్తుకు రాలేదు కానీ….ఇప్పుడు ఓట్ల కోసం గుర్తుకు వస్తున్నామా? అంటూ నడిరోడ్డుపైనే వారిని కడిగిపారేస్తున్నారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

మళ్ళీ అదే హామీలతో ప్రచారానికి రావడంతో బీఆర్ యస్ పార్టీ నాయకులకు గో బ్యాక్ అంటూ నినాదాలు చెయ్యడంతో ఊహించని ఈ పరిణామాలపై బీఆర్ఎస్ నాయకులు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని గట్టి ధీమాతో ఉన్న గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహవేశాలను చూసి హై…. టెన్షన్ కు లోనవుతున్నారు.