రంగారెడ్డి జిల్లా : తాళ్ల కుంట చెరువు దర్జాగా కబ్జా

రంగారెడ్డి జిల్లా : తాళ్ల కుంట చెరువు దర్జాగా కబ్జా

సారు మా ఊరి చెరువును కాపాడండి గ్రామస్తుల డిమాండ్

మహేశ్వరం, మే 19, మన సాక్షి

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి గ్రామంలో తాళ్ల కుంట చెరువు కబ్జా” జరిగింది. మహేశ్వరం ఎంపీపీ సొంత ఊరిలో… ఘట్టుపల్లి తాలకుంట చెరువు కబ్జా జరిగిన పట్టించుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్ నాయకులు నవీన్ కుమార్, బీజేపీ నాయకులు ఆయిల్ల నర్సింహా గౌడ్, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తులు అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సారు… మా గ్రామ చెరువును కాపాడాలని ముక్తకంఠంతో గ్రామస్తులు అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. తాళ్ల కుంట చెరువు సరిహద్దు నిర్ధారించాలని ప్రకృతి సహజ సిద్దంగా ఉన్న చెరువులు కబ్జాలకు గురవుతున్న నిద్రా పోతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఘట్టుపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

 

ఘట్టుపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 69 లో తూలకుంట చెరువు 9.39 గుంటలు శిఖం భూమి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో కొంతమంది రియల్టర్లు,అధికార పార్టీ నాయకుల అండతో ఓ వ్యక్తితో చెరువులో నుంచి తన పొలానికి వెళ్ళడానికి దారి కోసం చెరువులో మట్టి పోసి రోడ్డు వేశాడు. ఈ తతంగం అంతా అధికార పార్టీ అండతోనే చెరువులో రోడ్డు వేశాడు.

 

ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి తాల్లకుంట చెరువు మొత్తం (ఎఫ్టిఎల్) సరిహద్దు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న చెరువు ఎంతవరకు కబ్జా జరిగింది జరగలేదు పూర్తి సర్వే చేసి మా చెరువును కాపాడాలని అధికారులను ప్రజాప్రతినిధులను గ్రామస్తులు కోరుకున్నారు.

 

ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు ఎమ్మార్పీఎస్ నాయకులు నవీన్ కుమార్, బీజేపీ నాయకులు ఆయిల్ల నర్సింహా గౌడ్, బొల్లెపాక రవి, గోసుల వెంకట్ రెడ్డి, చాకలి రవి,మంగలి రాజు, కొణింటి శేఖర్, ఎర్ర పండు, దేవుని శేఖర్, ఎర్ర చెంద్రయ్య, ఎర్ర రాజు, ఎర్ర సంజీవ, కావాలి రామచంద్రయ్య పాల్గొన్నారు