తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : ముఖ్యమంత్రి బహిరంగ సభ.. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..!

Suryapet : ముఖ్యమంత్రి బహిరంగ సభ.. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..!

సూర్యాపేట, మనసాక్షి :

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు జరగనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభకు సంబంధించి అన్ని భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందనీ అని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంగా పని చేస్తున్నామనీ 1200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బంది, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనీ చెప్పారు.

సిబ్బంది వివరాలు..

అదనపు ఎస్పీలు – 4
డిఎస్పీలు – 6
ఇన్స్పెక్టర్ లు – 33
సబ్ ఇన్స్పెక్టర్ – 110
ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ – 185
కానిస్టేబుల్, హోంగార్డ్ – 650
మహిళా సిబ్బంది – 150

స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, రోప్ టీమ్స్, షి టీమ్స్, మఫ్టి టీమ్స్ ఉంటాయి.

పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు : 

– సూర్యాపేట, తొర్రూరు, జనగాం వైపుగా వచ్చే ఆర్ టీ సి బస్సులు, పెద్ద వాహనాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, సంత నందు ఏర్పాటు చేసిన పి 6, పి 7 ప్రదేశాల్లో నిలుపుకోవాలి.

– సూర్యాపేట, తొర్రూరు, జనగాం వైపుగా వచ్చే ట్రాక్టర్లు, డీసీఎం లు తిరుమలగిరి క్రాస్ రోడ్ నుండి జనగాం వెళ్లే రోడ్డు మార్గంలో ఎడమవైపున సంత వెనకాల స్థలంలో ఏర్పాటు చేసిన పి 4 పార్కింగ్ ప్రదేశంలో నిలుపుకోవాలి.
– జనగామ, తొర్రూరు, సూర్యాపేట వైపుగా వచ్చే కార్లు, ఆటోలు, మిని వ్యాన్ లు వలిగొండ రోడ్డులో వచ్చి చెరువుకట్ట మార్గంలో ఉన్న పి 2, పి 11 మరియు పి 5 పార్కింగ్ ప్రదేశాల్లో నిలుపుకోవాలి.
– తొర్రూరు, సూర్యాపేట, జనగాం వైపుగా వచ్చే ద్విచక్ర వాహనాలు వలిగొండ మార్గంలో చెరువుకట్ట రోడ్డులో ఏర్పాటు చేసిన పి 3 పార్కింగ్ స్థలంలో నిలుపుకోవాలి.
– వలిగొండ మార్గంలో వచ్చే ఆర్ టీ సి బస్సులు, పెద్ద వాహనాలు అదే మార్గంలో ఉన్న ఐకేపీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన పి 10 పార్కింగ్ ప్రదేశంలో, వెంచర్ నందు ఏర్పాటు చేసిన పి 8 పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలుపుకోవాలి.
– వలిగొండ వైపుగా వచ్చే కార్లు ఆటోలు మినీ వ్యాన్ లు వెంచర్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన పి 9 పార్కింగ్ ప్రవేశము నందు నిలుపుకోవాలనీ సూచించారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  2. DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!

  3. Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)

  4. Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. అందరికి మేలు..!

మరిన్ని వార్తలు