వరద నీటిలో నడిగూడెం యస్. సి, బీసి కాలనీలు

వరద నీటిలో నడిగూడెం యస్. సి, బీసి కాలనీలు

నడిగూడెం, సెప్టెంబర్ 29, మన సాక్షి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని చౌదరి చెరువు అలుగు పోయడంతో వరద నీరు ప్రవాహం ఎక్కువై ప్రధాన వాగు నుండి పొర్లి ఎస్సీ, బీసీ కాలనీలోని ఇళ్లలోకి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, వంట సామాగ్రి వరదలో కొట్టుకుపోయినట్లు ప్రజల తెలిపారు.

ప్రధాన వాగును పక్కన ఉన్న ఇండ్లవారు వాగును వాగును ఆక్రమించుకోవడంతో వాగు విస్తీర్ణం తగ్గి వరదలు వచ్చినప్పుడు నీటి ప్రభావం ఎక్కువై చెరువు అలుగును తలపించేలా ప్రధాన వీధుల గుండా నీరు ప్రవహిస్తుంది.

ALSO READ : తుంగతుర్తి లో విషాదం.. పిడుగుపడి గొర్ల కాపరి మృతి

ఇండ్లలో ఉన్న వరద నీటిని తప్పించేందుకు యుద్ధ పాదిపాతికిన సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్న శ్రీనివాస్, గ్రామస్తులు సుధీర్, దున్న లింగయ్య, దున్న రాజు, అనంతుల మహేష్, దున్న ప్రవీణ్ ఎలుగురి నాగరాజు, లక్ష్మయ్య, మురళి, లక్ష్మీనారాయణలతో వరద ప్రాంతాల ను తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చేరుకొని జెసిబి తో రత్నవరం వెళ్లే ప్రధాన రహదారి వద్ద రోడ్డుకు గండి పెట్టడంతో కాలనీలోని ఇండ్లలోకి చేరుకున్న నీటిని తప్పించి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం సమయంలో సర్పంచ్ గ్రామస్తులతో కలిసి తాసిల్దార్ టీ నాగేశ్వరరావు వరదల ప్రవహిస్తున్న వీధులను పరిశీలించారు.

ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని కాలనీలోని ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కార మార్గాలని చూపాలని సర్పంచ్, తాసిల్దార్ కు ముంపు ప్రాంత ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ఉదయం అల్పాహారాన్ని సర్పంచ్ నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ ఏర్పాటు చేశారు.