సిరిసిల్ల : సివిల్ సప్లయ్ గోదాంలో అగ్ని ప్రమాదం

సిరిసిల్ల : సివిల్ సప్లయ్ గోదాంలో అగ్ని ప్రమాదం

11 లక్షల గన్నీ సంచులు ధగ్ధం..రూ.కోటి మేర ఆస్థి నష్టం..
– అగ్ని ప్రమాదం పై పలు అనుమానాలు..?

రుద్రంగి (రాజన్నసిరిసిల్ల) , మనసాక్షి: రాజన్న సిరిసిల్ల జిల్లా లో బారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోని అందులో ఉన్న సూమారు 11 లక్షల గన్నీ సంచులు కాలిపోయాయి.

గోదాం పై కప్పు మొత్తం మంటలతో ధగ్ధమైంది. రూ.కోటికి పైగా ఆస్థి నష్టం వాటిల్లింది. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ సమీపంలో ఉన్న గోదాంలో విద్యుత్ సప్లయ్ కూడా లేదు. షాట్ సర్క్యూట్తో ఈ అగ్ని ప్రమాదం సంబంధించే అవకాశాలు లేవు. ఎదరైన ఆ ప్రాంతంలో టఫాసులు కాల్చితే.. ఈ ప్రమాదం జరిగిందా.. ఎవరైన దుండగులు నిప్పంటించారా అనే విషయం అంతుచిక్కడం లేదు.

జరిగిన సంఘటనటపై సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గోదాంకు ఇన్స్రెన్స్ ఉన్నప్పటికి.. గన్నీసంచులకు లేకపోవడంతో రూ.80 లక్షల నుంచి కోటి వరకు ఆస్థి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ప్రాథమిక అంచాన వేస్తున్నారు. ప్రాణ నష్టం ఏం వాటిల్లకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దట్టమైన పోగలు కమ్ముకోవడంతో పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు.