Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!
Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!
మన సాక్షి ,తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త తెలియజేశారు. ఈనెల 9వ తేదీ లోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వరుసగా ప్రవేశపెడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలను అమలు చేయడంతో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంది.
గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు పంట సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధును ఈ సీజన్ వరకు యధావిధిగా కొనసాగిస్తుంది. రాబోయే వానకాలం సీజన్ లో రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా రైతుబంధు కు సంబంధించిన డబ్బులు ఇంకా కొంతమంది రైతులకు అందలేదు. అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మే 9వ తేదీ లోగా రైతులందరికీ అకౌంట్లో రైతుబంధు డబ్బులు వస్తాయని పేర్కొన్నారు.
కెసిఆర్ కు రేవంత్ సవాల్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేశారు. రైతుబంధు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈనెల 9వ తేదీ లోగా ప్రతి ఒక్కరి ఖాతాలలో రైతుబంధు డబ్బు పడుతుందని.. ఒకవేళ రైతుబంధు రాకుంటే 9వ తేదీన హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఏ ఒక్క రైతు కూడా రైతుబంధు రాలేదంటే.. తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా అంటూ సవాల్ చేశారు.
అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ వరకు రైతుల రుణమాఫీ చేసి హరీష్ రావుకు బుద్ధి చెప్తామన్నారు. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని చెబుతున్న కేసీఆర్ ఆయన ఏ కూటమిలో చేరుతారని అడిగారు. కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి కేసీఆర్ తీసుకోబోమని ,ఆయన చేరేది బిజెపిలోనే అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. మే 13వ తేదీ ఫైనల్స్ లో బిజెపిని ఓడించాలని ఆయన కోరారు. పదేళ్లపాటు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కెసిఆర్ దోచుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ :
Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!
Miryalaguda : ఘనంగా బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు.. కార్యకర్తల రక్తదానం..!
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!










