పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్.. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఆచితూచి సర్వేల ప్రకారం టికెట్లు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రెబల్స్ బరిలో లేకుండా ఆ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు ప్రయత్నం చేసి సఫలమయ్యారు.

పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్.. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం..!

70 నుంచి 75 స్థానాలు వచ్చే అవకాశం

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం

కేసీఆర్, కేటీఆర్ స్పీచ్ లతో విసుగెత్తిన ప్రజలు

రేవంత్ సభలతో హోరెత్తుతున్న ప్రజలు

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఆచితూచి సర్వేల ప్రకారం టికెట్లు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రెబల్స్ బరిలో లేకుండా ఆ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు ప్రయత్నం చేసి సఫలమయ్యారు.

ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ నుంచి ప్రచార హోరులో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో పోటీ చేయడంతో అధికార పార్టీకి సవాల్ విసిరినట్లు అయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొదట్లో కాంగ్రెస్ పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు, ఆ పార్టీ నేతలు పలువురు బహిరంగంగానే పేర్కొనడం విశేషం.

కానీ ప్రస్తుతం ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరగడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 75 స్థానాలు వస్తాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. 70 స్థానాలకు పైగా సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అనేక పర్యాయాలు పేర్కొన్నారు.

తెలంగాణలో అగ్ర నాయకుల ప్రచారం :

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే , ఆ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రియాంక గాంధీ బహిరంగ సభల వల్ల తెలంగాణకు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం ఉంది. ఈనెల 24, 25వ తేదీలలో ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించి.. తిరిగి 27, 28వ తేదీలలో కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి :

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. ఆరు గ్యారెంటీ పథకాలను ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహించారు. దానితోపాటు 66 పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి భారీ ప్రచారాలు నిర్వహిస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటి పథకాలపై తొలి సంతకాలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పడంతో ప్రజలు విశ్వసిస్తున్నారు.

కేటీఆర్ , కెసిఆర్ స్పీచ్ లతో విసుగెత్తిన ప్రజలు :

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ బహిరంగ సభలలో స్పీచ్ లతో ప్రజలు విసుగెత్తారు. ప్రతి బహిరంగ సభలో కూడా ఒకే రకమైన స్పీచ్ ఉండటం వల్ల ప్రజలు విసుగెత్తుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తుండగా కేటీఆర్ ఐదు నుంచి 6 నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

బహిరంగ సభలకు రోడ్ షోలకు వచ్చే ప్రజలు గత ఎన్నికలలో కేటీఆర్, కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు హామీల మాదిరిగానే ఈసారి కూడా ఇస్తున్నారని, ఇన్ని హామీలు ఇచ్చే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వీటన్నింటిని ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపడతామన్న హామీలకు పోటీగా బీఆర్ఎస్ హామీలు ఇస్తున్నారే తప్ప ఇంతకాలం ఎందుకు హామీలు అమలు చేయలేదని ప్రజలు భావిస్తున్నారు.