నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!

నల్గొండ నియోజకవర్గము, తిప్పర్తి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి బారి ఎదురుదెబ్బ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మితో సహా 11 మంది సర్పంచ్లు, డిసిసిబి డైరెక్టర్, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదు లోనీ ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ నియోజకవర్గము, తిప్పర్తి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి బారి ఎదురుదెబ్బ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మితో సహా 11 మంది సర్పంచ్లు, డిసిసిబి డైరెక్టర్, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదు లోనీ ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తన మిత్రులు, అనుచరులంతా బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని చెప్పిన కొన్ని గంటలలోనే ఆయన ముఖ్య అనుచరుడు నల్లగొండ నియోజక వర్గం తిప్పర్తి మండల జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి మండల వ్యాప్తంగా ఉన్న ఎంపీపీ సర్పంచులతో సహా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంఘటన ఆ పార్టీ లో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నా..!

ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సర్వారం సర్పంచ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్, తిప్పర్తి సర్పంచ్ రొట్టెల రమేష్, జొన్న గడ్డలగూడెం సర్పంచ్ నామిరెడ్డి వెంకట్రెడ్డి, కాశి వారి గూడెం సర్పంచ్  హుస్సేన్ బీ, రామలింగాలగూడెం సర్పంచ్ ముత్తినేని శ్రీదేవి శ్యామ్, గంగన్న పాలెం సర్పంచ్ మర్రి యాదగిరి, మర్రిగూడెం సర్పంచ్ పోకల సతీష్, దుప్పలపల్లి సర్పంచ్ ఒంటెపాక సుశీల, మామిడాల ఎంపిటిసి కొత్తపల్లి సిరివెన్నెల, రాయిని గూడెం సర్పంచ్ మైనం నాగయ్య, కంకణాలపల్లి సర్పంచ్ కోన జానయ్య, సిలార్మియా గూడెం సర్పంచ్ ఎర్ర మాద కవిత, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి సహా మరికొంత మంది మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.