కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నా..!

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 

కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నా..!

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

నల్లగొండ, మనసాక్షి :
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో  దేశానికే ఆదర్శంగా  నిలిచిందని, మళ్ళీ కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలన్నారు.

ALSO READ : WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఓకే ఫోన్ లో రెండు ఖాతాలు..!

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజలు కేసీఆర్ నే నమ్ముతారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తుందని గెలుస్తుందని.. ప్రస్తుత పరిస్థితులల్లో నాపైన కూడా కొన్ని అవస్తవలను ప్రచారం చేస్తున్నారని వాపోయారు.  ఏవి నమ్మొద్దని. నేను ఏ పార్టీలో వున్నా.. ఆ ఆపార్టీ విజయం కోసమే పని చేస్తానని, కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయిన వారి విజయాన్నే నిను కోరుకుంటున్నా.. అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అన్ని నియోజకవర్గాల్లో నాకు అభిమానులు, మిత్రులు వున్నారు.. వారందరికీ విజ్ఞప్తి బీఆర్ఎస్ నే గెలిపించండి.. ఇప్పుడు నాకు పార్టీలు మరాల్సిన అవసరం లేదు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిను కానీ, నా కుమారుడు కానీ పోటీ చేస్తాము.. అన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

అంతే కానీ పార్టీ మారము అని కెసిఆర్ తెలంగాన కు శ్రీరామరక్ష అని, తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ ఘన విజయం సాధించాలని, కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు ఘటన విషయం లో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు . సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయని దీనిని రాజకీయం చేయొద్దన్నారు.