సూర్యాపేట : కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి

టిపిసిసి ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి

టిపిసిసి ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అసలైన అభివృద్ధి జరుగుతుందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

 

గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో నిర్వహిచిన ఒక కార్యక్రమంలో చివ్వెంల మండలం రోళ్ళబండ తండ గ్రామ యువకులు 50 మంది బానోత్ మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 

ALSO READ : 

1. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!

2. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!

3. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!

4. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!

 

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని భావించిన యువతకు కెసిఆర్ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని, గంపెడాశతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను నైరాశ్యంలో పడేశారని ఆయన అన్నారు.

 

యువత అధైర్యపడకుండా ఇంకా రెండు మూడు నెలలపాటు ధైర్యంగా ఉండాలని, త్వరలో జరుగబోయే ఎన్నికల అనంతరం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అపుడు తెలంగాణ లోని అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని దామోదర్ రెడ్డి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి, జిల్లా సేవాదళ్ ఛీఫ్ ఆర్గనైజర్ ఆలేటి మాణిక్యం, భానోత్ మహేందర్ తో పాటు నర్సింహా, సాయి, ఉపేందర్, నరేష్, శరత్, భరత్ చంద్ర, గణేష్, భరత్, రాము, మదార్, నరేష్, అరుణ్, తరుణ్, మాలోతు గాంధీ, మాలోతు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు..