యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది : నల్లాల ఓదెలు

యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది : నల్లాల ఓదెలు
మందమర్రి,  మన సాక్షి :
కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో ఆదివారం చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు మాట్లాడుతూ కాంగ్రెస్ మానిఫెస్టోకు ఆకర్షితులైన యువత రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని,ఈ చేరికలు ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున తన ఆధ్వర్యంలో చేరికలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నరేష్ నల్లాల సందీప్ ఫణి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!