సూర్యాపేట : కాంగ్రెస్ మహాపాదయాత్ర

సూర్యాపేట : కాంగ్రెస్ మహాపాదయాత్ర

సోలిపేట నుంచి నేడు ప్రారంభం

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి :

నియోజకవర్గ సమస్యలకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల 18 న సోలిపేట గ్రామము నుండి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కోరారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని జే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఈ మహా పాదయాత్ర సోలిపేట గ్రామం నుంచి ప్రారంభమై 75 రోజులు కొనసాగుతుందని, సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి పెరుతూ కోట్లు కొల్లగొడుతున్న వారి గురించి ,కేసి ఆర్ నియంత పాలన గురించి ప్రజల వద్దకు వెళ్లి వివారిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రతి పౌరునికి పాలకులఅవలంబిస్తున్న విధానాలను పేడ ధోరణిని తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.

కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఇది కేవలం రమేష్ రెడ్డి పాదయాత్ర కాదు అని పేద ప్రజల,, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి భరోసా పాదయాత్రగా కాంగ్రెస్ భరోసాని ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో గత 9 సంవత్సరముల నుండి నిరంకుశ పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విభిన్న రాజకీయాలు ఓట్ల కోసం బిజెపి, బి ఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయని, ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే ఈడి, సి బి ఐ పేరుతో బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిందని, దేశం కోసం బలిదానాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశం కోసం బలిదానం ఇచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి ఈ పాదయాత్ర ను దేశంలో జరుగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా భారత్ జోడుయాత్రను 3600 కిలోమీటర్లు చేసిన ఘనత కేవలం రాహుల్ గాంధీకే దక్కుతుందని అన్నారు.

దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని, కేవలం ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో మాత్రమే ఉంటున్నారని అన్నారు. ఇదేవిధంగా బిజెపి పాలన కొనసాగితే భారతదేశ చీలిపోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులు కొల్లగొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్, బిఆర్ఎస్ గా మారిందని, రానున్న రోజులో వీఆర్ఎస్ గా మారుతుంది అని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన నాయకులు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు బాగుపడ్డారు తప్ప ఒక్క పేదవాని కూడా న్యాయం జరగలేదని అన్నారు.

మిల్లులో హమాలీలుగా పని చేసిన కొంతమంది నాయకులు ఈరోజు బెంజ్ కార్ లో తిరుగుతురని, రైతులు మాత్రం బాగు చేయలేదని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఖాళీలను నింపే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రైతులు పండించిన పంటను సరైన టైముకు కోనే నాధుడే లేదని అన్నారు. రైతుల రుణమాఫీ, పేద రైతుకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఇవ్వలేదని కోరారు. కెసిఆర్ అవినీతి కుటుంబ పాలన గద్దతింపేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. నియోజకవర్గ గడపగడపకు కాంగ్రెస్ పాలన అవసరమనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్ననలను పొందాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు శీను అధ్యక్షతన జరపడం చాలా సంతోషదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, నామ అరుణ ప్రవీణ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదాల రంగారెడ్డి, ముదిరెడ్డి రమణారెడ్డి, పాలవరపు వేణు, బంటు చుక్కయ్య గౌడ్, పగిల్ల శంకర్, పిల్లల రమేష్ నాయుడు, స్వామి నాయుడు, సైదిరెడ్డి, ఫారుక్, ధర్మానాయక్ ,సంజయ్, కొండేటి శ్రీకాంత్, ఆకాష్, సైదిరెడ్డి ,వెంకట్ , ,సోమయ్య , యూత్ కాంగ్రెస్ , ఎన్ ఎస్ యు ఐ నాయకులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో పాటు తదితరులు పాల్గొన్నారు.