అధికారిక లాంచనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు, అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

అధికారిక లాంచనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు, అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

నివాళులు అర్పించిన ఎస్పి రోహిణి ప్రియదర్శిని

మనోహరాబాద్ , మనసాక్షి :

రోడ్డు ప్రమాదం లో బ్రెయిన్ డెడ్ అయి యశోద అస్పత్రి లో మృతిచెందిన కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి అంత్యక్రియలు శుక్రవారం తన వ్యవసాయ పొలంలో అధికారిక లాంచనలతో గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.

 

అంతకుముందు పార్దివ దేహాన్ని అయన నివాసం లో జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని సందర్శించి నివాళులు అర్పించారు. భార్యపిల్లలకు దైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్ష్మారెడ్డి మృతి పట్ల చింతిస్తున్నట్లు డిపార్ట్మెంట్ పరంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.అకాల మరణం పట్ల వారి భార్యకు ఉద్యోగ వచ్చేలా చూస్తామని ఆమె తెలిపారు.

 

అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

 

శుక్రవారం ఉదయం యశోద హాస్పటల్ లో లక్ష్మారెడ్డి అవయవాలు కల్లు,గుండె, మూత్రపిండాలు, కాలేయం లను దానం చేశారు.తాను అసువులు బాసినా నలుగురిలో కనిపించాలానే ఆకాంక్ష తో అవయవ దానం చేయడం పట్ల పలువురు హృదయానందం చెందారు.