మిర్యాలగూడ : సిపిఎంలో చేరిక

మిర్యాలగూడ : సిపిఎంలో చేరిక
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పట్టణ శివారులోని దుర్గానగర్ లో 50 మంది సిపిఎం లో చేరారు. వీరికి జూలకంటి రంగారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజులేని పోరాటాలు చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీలే అన్నారు. వారికి కూడు గూడు ఉపాధి కోసం పాలకులపై ఉద్యమాలతో ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. పేదల పక్షాన చట్టసభల్లో గళ మెత్తెందుకు కమ్యూనిస్టులు అవసరం ఉందని రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టులకు అసెంబ్లీకి పంపాలన్నారు. కమ్యూనిస్టులతోనే పేద ప్రజలకు సంక్షేమం అందుతుందని చెప్పారు.
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జగన్, కనకయ్య పవన్ తదితరులు పాల్గొన్నారు…